KMR: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.కామారెడ్డి నియోజకవర్గంలో 80 శాతం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు.