SKLM: పంచాయతీలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం పట్ల ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎంపీడీవో కె.వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. బుధవారం నరసన్నపేట మేజర్ పంచాయతీలో థియేటర్ యజమాన్యం, హోటల్స్ యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ.. తప్పనిసరిగా పారిశుద్ధ్యం పట్ల పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.