చిత్తూరు నగరపాలక పరిధిలోని దొడ్డిపల్లి శ్రీ సప్త కనికలమ్మ దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.