VSP: స్టీల్ ప్లాంట్ కోహినూర్ వజ్రమని, బీజేపీ అదానికి అమ్మే యత్నాన్ని అడ్డుకుంటామని ఏఐసీసీ ప్రతినిధి సునీల్ అహిరా అన్నారు. ఇవాళ విశాఖలో డీసీసీ ఎన్నికలపై నాయకుల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్లాంట్‌ను సైల్లో విలీనం చేసి రక్షించాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. విభజన హామీల సాధనలో ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు.
Tags :