NLG: మిషన్ వాత్సల్య పధకం అమలులో భాగంగా చిట్యాల పురపాలిక కార్యాలయంలో కమీషనర్ శ్రీను అధ్యక్షతన అవగాహన సమావేశం ఇవాళ జరిగింది. వార్డు స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి శుక్రవారం కమిటి సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఇందులో భాగంగా కమిటి యొక్క భాధ్యతల గురించి బాలల రక్షణ అధికారిని విద్య, ఐసీడీఎస్ అధికారులు తెలియజేశారు.