KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీక్ష రైనా ఇవాళ పరిశీలించారు. సింగరేణి, భాగ్యనగర్, సీతారాంపురం, కోమట్ల గూడెం గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో రవీంద్ర ప్రసాద్, ఎస్సై గోపి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.