TG: ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ, సీఎం రేవంత్ ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాట్లను మెస్సీ ‘గోట్’ బృందం పరిశీలించింది. మెస్సీ జెర్సీ నెం.10ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ఈ బృందంలో ‘గోట్ ‘చీఫ్ ప్యాట్రన్ పార్వతిరెడ్డి, చీఫ్ ప్రమోటర్ శతద్రు, మెస్సీ సలహాదారు క్రిస్టోఫర్ ఫ్లానెరీ, పర్సనల్ మేనేజర్ పాబ్లో నెగ్రే ఉన్నారు.