BHPL: జిల్లాలో మొదటి, రెండో దశ GP ఎన్నికల నామినేషన్లకు నేటితో తెరపడింది. ఇక నుంచి రెబల్స్ బుజ్జగింపుల పర్వం మొదలైంది. టికెట్ ఆశించిన ఆశావహులు పార్టీలు మారే పరంపర కొనసాగుతోంది. గరిష్టంగా ఏకగ్రీవాలు చేయాలన్న MLA గండ్ర ఆశలు గల్లంతవుతున్నాయి. అటు BRS కూడా జంపింగ్ జిలానీలతో కొట్టుమిట్టాడుతోంది. పోటీ తప్పదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.