నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ ఈ నెల 5న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా రాబోతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేసిన ఫొటోల్లో బ్యాక్గ్రౌండ్లో ‘జై అఖండ’ అని కనిపిస్తుంది. దీంతో ‘అఖండ 3’ టైటిల్ ఇదే అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.