KDP: బ్రహ్మ సాగర్ రిజర్వాయర్లో 12 టీఎంసీల నీరు చేరగానే భారీ లీకేజీలు ఏర్పడ్డాయని, 42 కోట్ల రూపాయలతో చేపట్టిన మరమ్మతు పనులు నాసిరకంగా జరిగాయని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. శివకుమార్ ఆరోపించారు. బుధవారం సాగర్ను CPM నాయకులు పరిశీలించారు. మెగా కంపెనీని బ్లాక్ లిస్టులో చేర్చాలని, పర్యవేక్షించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.