BHPL: కాటారం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించి, ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు.