పశ్చిమ బెంగాల్ నాదియాలో ఓ బాత్రూమ్ వద్ద రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పసిబిడ్డను దుప్పటిలో చుట్టి వదిలేశారు. అయితే, ఆ పసికందు చుట్టూ వీధి కుక్కలు చేరి.. ఉదయం వరకు రక్షణగా ఉన్నాయి. తెల్లవారిన తర్వాత కుక్కల మధ్యలో చిన్నారి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారిస్తున్నారు.