TG: హిల్ట్ పాలసీ వివరాలు బయటకు రావడంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20న ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని, మరుసటి రోజే కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై IPS నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.