MDK: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ సమాచార శాఖ కార్యాలయం ముట్టడి కార్య క్రమానికి రామాయంపేట మండల జర్నలిస్టులు తరలివెళ్లారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జి. శ్రీనివాస్ శర్మ, మండల అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో మండల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.