వలసదారుల ఆంక్షలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఐరోపా ఇమిగ్రేషన్ ఆంక్షలపై స్పందిస్తూ.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తే ఆయా దేశాలకే నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయా దేశాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సమస్యపై పరిష్కారం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.