ATP: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు దివ్యాంగులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. దివ్యాంగుల అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.