MBNR: హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పాలమూరు జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు మధు గౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ గడువు ముగిసిపోయినా, ఇంకా పొడిగిస్తూ ఉండడం సమంజసం కాదన్నారు.