TG: HYDలో చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 మధ్య కాలంలో జరిగిన అవకతవకలపై గోల్కొండ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన 15 మందిని బాధ్యులుగా చేశారు. ఈ మేరకు బాధ్యుల నుంచి రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని.. అటు ప్రభుత్వానికి, ఇటు రిపోర్టులో పేర్లు ఉన్న 15 మందికి ఆదేశించింది.