KMR: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్ డిపో సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలో చెత్త పేరుకుపోయి, కంపు కొడుతోందని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ పక్కన ఉన్న దుకాణాల వ్యాపారస్తులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని విమర్శిస్తున్నారు.