వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎంపీలు, కీలక నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈసీ నిర్వహిస్తున్న SIRపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని పట్టించుకోవద్దని సూచించారు. బీజేపీ నాయకులంతా సమిష్టిగా పనిచేస్తే అధికారం చేపట్టడం ఖాయమంటా వారిని ప్రోత్సహించారు.