పెళ్లైన 20 నిమిషాలకు విడాకులు కావాలని వధువు కోరిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. భలౌని ప్రాంతానికి చెందిన విశాల్, పూజకు NOV 25న వివాహం జరిగింది. అత్తగారింటికి వచ్చిన తర్వాత వరుడు, వధువును ఒక గదిలో ఉంచారు. 20 నిమిషాల తర్వాత పూజ బయటకు వచ్చి తనకు విడాకులు కావాలని కోరింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినలేదు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో వారికి విడాకులు ఇప్పించారు.