ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగులను మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. రోజువారీ పనిలో ఎదుర్కొనే సవాళ్లను, వాటిని అధిగమించే మనోధైర్యాన్ని దివ్యాంగ ఉద్యోగులు పంచుకున్నారు. దివ్యాంగ ఉద్యోగుల పనితీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.