SKLM: ఆమదాలవలస పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ టి.రవి టిఫిన్ సెంటర్లు, డాబాలు, హోటల్స్, రెస్టారెంట్ యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజువారీ వంటకాలు అదే రోజునే విక్రయించాలని, మినరల్ వాటర్ అందించాలని, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచించాలని సూచించారు. అలాగే అంటురోగాలు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.