NGKL: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి పట్టణ విశ్వబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కీలక ఘట్టాల్లో ఆయన ఆత్మార్పణం ఒకటి అని అన్నారు. తన ఆత్మ బలిదానం ఉద్యమానికి ఊపిరి పోసిందని కొనియాడారు.