GDWL: ఆదిశిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప ) స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం మల్దకల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో మూడు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. బుధవారం ఆలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, మేనేజర్ నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వాటర్ ట్యాంకులకు పూజలు నిర్వహించి, ప్రారంభించారు.