పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో యుద్ధానికి మునీర్ ఆరాటపడుతున్నట్లు ఆరోపించారు. ఆయన చాలా తీవ్రవాద ఇస్లామిస్ అని మండిపడ్డారు. అదే సమయంలో తన సోదరుడిపై ప్రశంసలు కురిపించింది. ఇమ్రాన్ స్వచ్ఛమైన ఉదారవాది అని పేర్కొంది. ఇమ్రాన్ ఎప్పుడు భారత్‌తో స్నేహపూర్వక సంబంధాన్ని కోరుకున్నారని చెప్పింది.