NGKL: అచ్చంపేట మండలం ఐనోలు నుంచి కన్య తండాకు వెళ్లే మట్టి రోడ్డు మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో బైక్ ప్రమాదాలు జరిగి చాలామంది గాయాలపాలయ్యారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.