కృష్ణా: గుడివాడ పురపాలక సంఘ పరిధిలో ఆటో మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఇంటి పన్ను పేరు మార్పు సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ బుధవారం అన్నారు. ఇళ్ళు, ఖాళీ స్థలాలకు జరిగే రిజిస్ట్రేషన్ల ఫీజుతో పాటు ఇంటి పన్ను పేరు మార్పు ఫీజును కూడా చెల్లించి, రిజిస్ట్రేషన్ పురపాలక సంఘ రికార్డుల్లో ఒకేసారి పేరు మార్పు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.