HNK: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని HNKలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో బుధవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు.