NRPT: దామరగిద్ద మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు సర్పంచ్ పదవికి 91 మంది, వార్డు సభ్యులకు 450 మంది నామినేషన్లు వేశారు. మొత్తం 30 గ్రామ పంచాయతీలకు గాను మూడు రోజుల్లో సర్పంచ్ పోటీకి 164 మంది, 284 వార్డులకు 566 మంది బరిలో నిలిచారు. మండలంలో మొత్తం 730 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.