BPT: ఎన్టీఆర్ అగ్రికల్చర్ కాలేజీలో సీఐ రాంబాబు విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, ర్యాగింగ్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోన్ యాప్స్, మ్యాట్రిమోనీ మోసాలు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానిత లింక్స్ క్లిక్ చేయొద్దని, ఆపదలో రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ‘శక్తి’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.