మునగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటెస్ట్రింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో అధికార TRS పార్టీ ప్రచార సభలో… టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పాటకు పలువురు డాన్స్ చేయడం చూడవచ్చు. మా అన్నా రేవంత్ అంటూ కొనసాగుతున్న పాటుకు వేదికపైనే అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.