మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో.. అన్ని పార్టీలు అక్కడ గెలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… బీజేపీ నేత బండి సంజయ్ ఈ ఉప ఎన్నికపై మాట్లాడారు. మునుగోడులో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఆ గెలుపు తర్వాతే… దసరా, దీపావళి పండగలు చేసుకుందామంటూ పిలుపు నిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు ఈ స్థానం ఫై గెలవాలని గట్టి పోటిమీదున్నాయి.
ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ప్రతిపార్టీ ట్రై చేస్తుంది. తాజాగా ఈ ఉప ఎన్నికకు సంబదించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అలాగే.. 17 వరకు ఉపసంహరణ కార్యక్రమం ఉండనుంది. ఇక నవంబర్ 3 న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా.. 6న ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు బండి సంజయ్. సర్వేలన్నీ బిజెపి విజయం ఖాయమని తేల్చాయని అన్నారు. ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ రాష్ట్రంలో కనిపించదు అని అన్నారు.. ఓటుకు 30 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. అందుకే మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిద్దాం.. కమల వికాసానికి పాటు పడదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. ఎన్నిక ఫలితాల తర్వాతే దసరా, దీపావళి చేసుకుందాం.. అంతవరకు అన్ని పనులు పక్కనబెట్టి మునుగోడులో మకాం వేయాలని.. బండి సంజయ్ టెలీ కాన్ఫరెన్స్లో నేతలతో మాట్లాడారు.