హైదరాబాద్ నగరంలో నయా దందా మొదలైంది. యువతులను టార్గెట్ చేసి…వారి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏ అమ్మాయి ఎవరైనా అబ్బాయితో కనపడితే చాలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓపేజీ కూడా తెరవడం గమనార్హం.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాముండా-అఫీషియల్ అనే అధికారిక పేరుతో ఒక ముఠా ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తోంది. వీడియోలు పోస్టు చేసి ఓ వర్గం యువతులను టార్గెట్ చేస్తోంది. తమ కమ్యూనిటీని డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ తో పోస్టులు చేస్తున్నారు.
ఝాముండ లో అఫిషియల్ గా ఇన్స్‌స్టా లో 12 వేల ఫాల్లోవర్లు ఉన్నారని తెలుస్తుంది. ఝాముండా పేజ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. మొత్తం 900 మంది యువకులు వీడియోలు తీసే పనిలో ఉన్నారని తెలియడం గమనార్హం. వీరి ఆగడాలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఝాముండ పేజ్ పై 506,509,354(D), సెక్షన్ల కింది మూడు కేసులు నమోదు చేశారు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశామని పోలీసులు వెల్లడించారు.