HNK: పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్, హౌస్ బూజూర్గు గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో MLA పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంబించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.