KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని మాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి, మంటల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే అంశాలపై సిబ్బంది వివరించారు.