SDPT: దుబ్బాక మండలం పరశురాం నగర్ గ్రామాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎమ్మెల్యే, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.