NLG: తిప్పర్తి మండలం గోదావరిగూడెంలో కనకదుర్గ అమ్మవారి, గరుడ ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడ ధ్వజానికి నవ ధాన్యాలు సమర్పించి అర్చన చేశారు. ఆయన వెంట నల్గొండ మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.