కర్నూలు: నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని శ్రీకృష్ణ పీఠంలో నిర్వహిస్తున్న 89వ విశ్వశాంతి మహాయాగంలో ఇవాళ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దేశంలో శాంతి, ప్రజల సౌభాగ్యం కోసం మహాయాగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.