కడప రవీంద్రనగర్‌లో ఒంటరిగా తిరుగుతున్న మూడేళ్ల హాసన్ అలీ, ఏడాది వయసున్న మెహెక్ అనే ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించారు. వీరి తల్లిదండ్రులు అశ్రు, సుభహన్ అని బాలుడు తెలిపాడు. ప్రస్తుతం కడప తాలూకా పోలీస్ స్టేషన్లో పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఈ చిన్నారుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.