RR: షాద్ నగర్ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు ఆశన్న భుజంగారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో అనేకమంది అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు కొన్ని నెలలుగా నూతన పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.