ఖమ్మం: జిల్లాలో బాలల హక్కులు, భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ సీతా దయాకర్ రెడ్డి తల్లిదండ్రుల అవగాహనతోనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. బాలల విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాల్య వివాహాల నివారణ, పోషకాహారం, పాఠశాల సదుపాయాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.