AP: గోవాలో లోక్‌భవన్‌లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వెస్ట్ జోన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మేవరిక్ మెస్సయ్య పుస్తకాన్ని అశోక్ గజపతిరాజుకు బహూకరించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా రమేష్ కందుల ఈ పుస్తకాన్ని రచించారు.