MBNR: చౌడూరులో ఓ భూమి వివాదం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఇది అదునుగా చేసుకుని సదరు మహిళ భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఇతరులకు విక్రయించాడు. అయితే, ఆ మహిళ కుటుంబానికి ప్రభుత్వ లబ్ధి వస్తున్నా, భూమి దక్కడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం న్యాయం చేయాలని HIT TV ద్వారా బాధితులు కోరుతున్నారు.