MDK: రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామ పెద్ద చెరువును తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ తనిఖీలో ఎంపీడీఓ షాజులుద్దీన్, అటవీ శాఖ అధికారి (FRO) విద్యాసాగర్, సాగునీటి శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు చెరువు కట్టల పటిష్టతను, ఇతర సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించి తగు సూచనలు చేశారు.