VKB: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. TVAE-JAC పిలుపుతో తాండూరు నియోజకవర్గ విద్యుత్ కార్యాలయం ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. సమస్యలు తీరే వరకు పోరాటం ఆపమని వారు స్పష్టం చేశారు. ఈ సమ్మె కారణంగా విద్యుత్ సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.