CTR: చౌడేపల్లె మండలం బోయకొండ సమీపంలో ఈనెల 5న కుమారుని కళ్లెదుటే గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. నిందితులు నరసింహులు, లక్ష్మీపతి, రాసతి, నాగరాజులను గురువారం బోయకొండ ఆర్చి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.