WNP: పెబ్బేరు మండలం బునియాదిపురం గ్రామానికి చెందిన చిన్నదాసు ఆవు పెబ్బేరులోని పశు వైద్యశాలలో రెండు తలలతో దూడ జన్మించిందని మండల పశు వైద్యాధికారి విజయ్ కుమార్ తెలిపారు. గర్భాధారణ సమయంలో జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పారు. పుట్టిన వెంటనే దూడ మృతి చెందిందన్నారు.