W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1,100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.