MNCL: జన్నారం మండల కేంద్రంలోని నటరాజ కళాక్షేత్రం నిర్వాహకురాలు డాక్టర్ నర్మదా గౌడ్‌కు మంచిర్యాల డిప్యూటీ మేయర్ రమ్యశ్రీ రమాబాయి అంబేద్కర్ అవార్డును అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలో ఆమెకు డిప్యూటీ మేయర్ అవార్డును అందించారు. భరతనాట్యం, తదితర నృత్యాలను చిన్నారులకు నేర్పుతూ డాక్టర్ నర్మదా గౌడ్ విశేష కృషి చేశారన్నారు.